: కనుచూపై దారిచూపే బూట్లు


కళ్లున్నా కొందరికి కళ్లు మూసుకుపోయి ముందున్న వస్తువులు కనబడవు. దీంతో వాటిని ఢీకొట్టి ముందుకు పడుతుంటారు. అయితే కళ్లు లేనివారి పరిస్థితి ఎలా ఉంటుంది... ఒక్కసారి ఊహించండి. వాళ్ళకు లోకమంతా చీకటి మయమే. ఇలాంటి కళ్లులేనివారికోసం ప్రత్యేకమైన బూట్లను యువ శాస్త్రవేత్త రూపొందించాడు. ఈ బూట్లతో అంధులు కూడా సాధారణ వ్యక్తుల్లాగా నడిచి వెళ్లవచ్చని చెబుతున్నారు.

విశాఖపట్నానికి చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్ధి ఇంకొల్లు కృష్ణసాయి ఒక ప్రత్యేకమైన బూట్లను తయారుచేశాడు. ఈ బూట్లతో అంధులు సాధారణంగా కళ్లున్న వాళ్లు వెళ్లినట్లుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా నడిచివెళ్లవచ్చని చెబుతున్నాడు. రెండేళ్లపాటు కృషిచేసి కృష్ణసాయి ఈ బూట్లను తయారుచేశాడు. ఈ బూట్లకు ముందుభాగంలో సెన్సర్లు ఉంటాయి. ఇవి నడక మార్గంలో రెండు మీటర్ల లోపు 45 డిగ్రీల ఎత్తు వరకూ ఎలాంటి అడ్డంకి వచ్చినా గుర్తించి బూటు కింది భాగంలో ఉన్న చిన్నపాటి మోటారు ద్వారా సంకేతాలు పంపుతాయి. అడ్డంగా ఉన్న వస్తువు పరిమాణాన్ని బట్టి సంకేతాల తీవ్రత మారుతూ ఉంటుంది. దీని ఆధారంగా మార్గంలో ఉన్న అడ్డంకిని అంచనా వేసుకుని అంధులు తమ దిశను మార్చుకుంటూ ముందుకు వెళ్లవచ్చని కృష్ణసాయి చెబుతున్నాడు.

  • Loading...

More Telugu News