: తొలగనున్న రైల్వే ఈ-టికెటింగ్ కష్టాలు
రైల్వే తత్కాల్ సేవలకు బాగా అలవాటు పడ్డ ప్రయాణీకులకు..ఈ-టికెటింగ్ లో రిజర్వేషన్ చేసేందుకు మాత్రం గంటల తరబడి ఐఆర్సీటీసీ వెబ్ సైట్ ముందు నిరీక్షించాల్సి వస్తోంది. ఈ సమస్యను నివారించేందుకు 40 వేల మంది ఉపయోగించేందుకే వీలున్న వెబ్ సైట్ సామర్థ్యాన్ని లక్షా 20 వేలకు పెంచనున్నట్లు రైల్వే మంత్రి బన్సల్ రైల్వే బడ్జెట్ లో ప్రకటించారు.
అలాగే నిమిషానికి 2వేల టిక్కెట్లను వెబ్ సైట్ అందిస్తుండగా దీనిని 7,200 కు రైల్వే శాఖ పెంచబోతోంది. ప్రయాణీకులు ఎదుర్కొంటున్న ఈ ప్రధాన సమస్య త్వరలోనే తొలగిపోతుందని రైల్వే శాఖ అంటోంది.
అలాగే నిమిషానికి 2వేల టిక్కెట్లను వెబ్ సైట్ అందిస్తుండగా దీనిని 7,200 కు రైల్వే శాఖ పెంచబోతోంది. ప్రయాణీకులు ఎదుర్కొంటున్న ఈ ప్రధాన సమస్య త్వరలోనే తొలగిపోతుందని రైల్వే శాఖ అంటోంది.