: హైదరాబాదులో అమెరికా కాన్సులేట్ కు కొత్త జనరల్
హైదరాబాద్ నగరంలోని అమెరికా కాన్సులేట్ కు కొత్త జనరల్ గా మైఖేల్ ముల్లిన్స్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఇక్కడ కాన్సులేట్ జనరల్ గా వ్యవహరించిన కేథరిన్ ధనాని అమెరికాకు బదిలీ అయ్యారు. ముల్లిన్స్ ఇంతక్రితం ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో మేనేజ్ మెంట్ వ్యవహారాలు పర్యవేక్షించారు. ఫ్రెంచితో పాటు పలు భాషల్లో ఈయనకు ప్రావీణ్యం ఉంది.