: ప్రధాని నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ


ఢిల్లీలోని రేస్ కోర్స్ రోడ్డులో ఉన్న ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం మొదలైంది. అధినేత్రి సోనియాగాంధీ, ఆర్ధికమంత్రి చిదంబరం, హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, ఇతరులు ఈ సమావేశానికి హాజరైనట్లు తెలుస్తోంది. దేశంలోని తాజా పరిస్థితులు, త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలపై వీరు చర్చిస్తారు. కాగా, రాష్ట్ర విభజన అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ఈ రోజే ఆంటోనీ కమిటీ, విభజన నేపథ్యంలో తలెత్తిన అంశాలతో రూపొందించిన తమ నివేదికను సమర్పించనుంది.

  • Loading...

More Telugu News