: తమ ప్రాంతంలో సభ పెట్టమని తెలంగాణ ప్రజలు ఫోన్ చేస్తున్నారు: అశోక్ బాబు
హైదరాబాదులో ఈ నెల 7న జరిపిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ విజయవంతం అయిన తర్వాత, తమ ప్రాంతాల్లోనూ సభలు జరపాలని తెలంగాణ ప్రజల నుండి ఫోన్లు వస్తున్నాయని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు చెప్పారు. సమైక్యాంధ్ర వాదం అన్ని చోట్లా ఉందనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలని అన్నారు. అశోక్ బాబు మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో సీమాంధ్రులు దోచుకుతింటున్నారని ప్రకటనలు చేసేవారికి, విద్యుత్ ఉద్యోగుల సమ్మే జవాబిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ నుంచి బొగ్గు, నీరు తీసుకుంటున్నా విద్యుత్ రూపంలో వాటిని తిరిగి తెలంగాణకే అందిస్తున్నట్టు వివరించారు. త్వరలో రాష్ట్రవ్యాప్త పర్యటన చేయనున్నట్టు వెల్లడించారు. ఇక ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈనెల 20న విజయవాడలో, 21న విశాఖలో, 23న హిందూపురంలో, 24న కడపలో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని చెప్పారు.