: తీర్పును స్వాగతించిన అమల


నిర్భయ అత్యాచార కేసులో నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేయడాన్ని స్వాగతిస్తున్నట్టు అక్కినేని అమల పేర్కొన్నారు. న్యాయం లభించినట్టయిందని ఆమె ఈ సందర్భంగా ఫేస్ బుక్ లో తెలిపారు. 'నిర్భయా, నీ ఆత్మకు శాంతి కలుగుగాక' అని వ్యాఖ్యానించారు. 'భారత్ దృక్పథాన్ని నీవు మార్చివేశావు. నువ్విప్పుడు ప్రతి కుటుంబానికి కుమార్తెవే' అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News