: ప్రధానిగా మోడీని దేశం అంగీకరించదు: దిగ్విజయ్ సింగ్
ఓ వైపు నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటిచేందుకు బీజేపీ తొందరపడుతుంటే, మరోవైపు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రధానమంత్రిగా మోడీని దేశం ఒప్పుకోదన్నారు. దేశాన్ని ఆయన సమైక్యంగా ఉంచలేరని వ్యాఖ్యానించారు. తన ఆశయాల కోసం సొంత పార్టీలో చిచ్చుపెట్టి, వివాదాన్ని రేపిన వ్యక్తి మోడీ అంటూ దిగ్విజయ్ తీవ్రంగా విమర్శించారు. అలాంటి వ్యక్తి జాతిని ఒకే తాటిపై నడిపించలేరని, ప్రజలు కూడా ఇందుకు అంగీకరించరన్నారు. నిన్న రాత్రి (గురువారం) ప్రావిడెంట్ ఫండ్ ఉద్యోగుల ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో దిగ్విజయ్ పాల్లొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పైవిధంగా వ్యాఖ్యానించిన డిగ్గీ.. కాంగ్రెస్ కు మోడీయే ప్రధాన లక్ష్యం కాదన్నారు. కాంగ్రెస్ ఏ ఒక్క వ్యక్తిపై యుద్ధం చేయదని పేర్కొన్నారు.