: విభజన జరిగితే కాంగ్రెస్ కు గుడ్ బై: ఎంపీ రాయపాటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని ఎంపీ రాయపాటి సాంబశివరావు ప్రకటించారు. ఈ రోజు గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. తనకు పార్టీకన్నా ప్రజలే ముఖ్యమని అన్నారు. రేపు హైదరాబాద్ లో జరిగే సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సమావేశానికి తాను హాజరుకావడం లేదని తెలిపారు. ప్రజా ప్రతినిధులందరూ రాజీనామా చేశాక సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు. రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్రతో పాటు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని హెచ్చరించారు.