: 4న అక్బరుద్దీన్ బెయిల్ పిటిషన్ పై విచారణ


కలెక్టర్ ను దూషించిన కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ బెయిల్ పిటీషన్ పై విచారణను సంగారెడ్డి అర్బన్ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. మెదక్ జిల్లా సంగారెడ్డి న్యాయస్థానంలో అక్బరుద్దీన్ తరపు లాయర్ ఈ పిటిషన్ ను వేశారు. దీనిపై విచారణను జిల్లా ఐదవ అదనపు న్యాయమూర్తి ఈ నెల 4కు వాయిదా వేశారు. మరోవైపు అక్బరుద్దీన్ ను నేడు, రేపు నిజామాబాద్ పోలీసులు విచారించనున్నారు. ఇందుకోసం ఆయనను పోలీసులు ఈ ఉదయమే అదిలాబాద్ జైలు నుంచి నిజామాబాదుకు తరలించారు.

  • Loading...

More Telugu News