: అమెరికాపై మరిన్ని దాడులు చేయండి: అల్ ఖైదా
అమెరికాపై మరిన్ని దాడులు జరపాలని జిహాదీలకు అల్ ఖైదా అగ్రనాయకుడు అయిమాన్ అల్ జవహరి పిలుపునిచ్చారు. అమెరికాపై దాడులకు పాల్పడి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన గుర్తు తెలియని ప్రదేశం నుంచి ప్రసంగించారు. దీనికి సంబంధించిన వీడియో టేపులను అమెరికా నిఘావర్గాలు సంపాదించాయి. 72 నిమిషాల జవహరి ప్రసంగాన్ని నిఘావర్గాలు ఇంగ్లీషులోకి అనువదించాయి. 2001 సెప్టెంబర్ 11న అమెరికాపై అల్ ఖైదా దాడులు చేసింది. ఆ దాడుల్లో మూడు వేల మందికి పైగా మరణించారు.
అమెరికాపై దాడుల అనంతరం... ఆ దేశం తన భద్రత కోసం భారీ మొత్తంలో నిధులను కేటాయిస్తోందని ఆయన అన్నారు. జిహాదీలు అమెరికాపై నిరంతరం దాడులను కొనసాగించాలని... దీంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పతనమౌతుందని అన్నారు. ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిన అమెరికాను ప్రతి ఒక్కరూ బహిష్కరించాలని ఆయన ప్రపంచానికి పిలుపునిచ్చారు.