: డీజీపీ పిటిషన్ పై గడువు కోరిన ప్రభుత్వం
తన పదవీకాలం పెంచాలంటూ క్యాట్ లో రాష్ట్ర డీజీపీ దినేశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై ప్రభుత్వం గడువు కోరింది. ఈ పిటిషన్ పై నేడు విచారణ జరిపిన క్యాట్ సర్కారును వివరణ అడగడంతో రెండు వారాల గడువు కావాలని చెప్పింది. దాంతో, దినేశ్ రెడ్డి వినతిపై ఈనెల 23లోగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని క్యాట్ ఆదేశించింది.