: వరల్డ్ సాకర్ లో మరింత దిగజారిన భారత్ ర్యాంకు


వంద కోట్ల పైచిలుకు జనాభా కలిగిన సువిశాల భారతం ఒక్క క్రికెట్ మినహా మరే క్రీడలోనూ అంతర్జాతీయంగా మెరిసిందిలేదు. ఒకప్పుడు హాకీలో తిరుగులేని ఆధిపత్యం చలాయించినా, ఇప్పుడా జాతీయక్రీడ మిణుకుమిణుకుమంటోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ ఉన్న క్రీడ ఫుట్ బాల్ లో మనవాళ్ళ గురించి మాట్లాడుకోవడానికేమీ ఉండదు. కారణం, ఆ క్రీడలో మన 'ప్రతిభ' అలాంటిది! పొరుగున ఉన్న నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్థాన్ పై మాత్రం మన జట్టు ప్రతాపం చూపిస్తుంటుంది. అందుకే, ర్యాంకు కూడా భారీగానే ఉంటుంది.

ఇప్పటిదాకా 145వ ర్యాంకులో కొనసాగిన భారత్.. ఫిఫా తాజాగా ప్రకటించిన ర్యాంకుల జాబితాలో ఓ పదిస్థానాలు దిగజారి 155కి చేరింది. ఇటీవలే నేపాల్ లో జరిగిన శాఫ్ కప్ ఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమే మన జట్టు ర్యాంకింగ్ పడిపోవడానికి కారణం. ఇక తొలి నాలుగుస్థానాల్లో ప్రపంచ చాంపియన్ స్పెయిన్, అర్జెంటీనా, జర్మనీ, ఇటలీ ఉన్నాయి.

  • Loading...

More Telugu News