: శత్రుచర్ల బైక్ ర్యాలీకి సమైక్య పోటు
రాష్ట్ర విభజన ప్రకటనకు నిరసనగా కాంగ్రెస్ నేతలు సీమాంధ్రలో చేపట్టే కార్యక్రమాలకు అడుగడుగునా వ్యతిరేకత ఎదురవుతోంది. తాజాగా మంత్రి శత్రుచర్ల విజయరామరాజు శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన బైక్ ర్యాలీకి సమైక్య పోటు తగిలింది. జిల్లాలోని సరుబుజ్జిలో మంత్రి బైక్ ర్యాలీని సమైక్యవాదులు అడ్డుకున్నారు. పదవికి రాజీనామా చేసిన తర్వాతే ఉద్యమంలో పాల్గొనాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై కాంగ్రెస్ కార్యకర్తలు ఉద్యమకారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.