: రూ. 200 కోట్లు రాబట్టిన కమల్ 'విశ్వరూపం'
నటుడు కమల్ హాసన్ తాజా చిత్రం 'విశ్వరూపం' బాక్సాఫీసు దగ్గర సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఇప్పటివరకు ఈ చిత్రం 200 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ చిత్రంలో నటించిన పూజా కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు.
తన ఆస్తినంతా తాకట్టు పెట్టి 95 కోట్ల భారీ బడ్జెట్ తో కమల్ హాసన్ తీసిన 'విశ్వరూపం' సినిమా ఆయన నమ్మకాన్ని నిలబెట్టింది. సినిమా విడుదలకు కమల్ ఎదుర్కొన్న మానసిక సంఘర్షణను పటాపంచలు చేస్తూ ఆయనకు ఈ చిత్రం కాసుల వర్షం కురిపించటంపై సర్వత్ర హర్షం వ్యక్తమౌతోంది.
ఇప్పటి వరకు వంద కోట్ల మార్కు చేరిన భారతీయ చిత్రాలను వేళ్ల మీద లెక్కించొచ్చు. అలాంటిది బాక్సాఫీసు దగ్గర 200 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టిన కమల్..కొత్త లక్ష్యాన్ని చలనచిత్ర రంగానికి నిర్దేశించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ జోరు కొనసాగిస్తున్న 'విశ్వరూపం' మరెన్ని రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.