: మోడీ ప్రధాని అభ్యర్ధిత్వానికి ఓకే చెప్పిన శివసేన
నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్ధిత్వానికి మద్దతు పెరిగిపోతోంది. నేడో, రేపో మోడీపై ప్రకటన చేయనున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ రోజు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే గుడ్ లక్ చెప్పారు. ఈ మేరకు మోడీకి ఫోన్ చేసిన ఉద్ధవ్.. ముందస్తు శుభాకాంక్షలు చెప్పారు. బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా మోడీని ప్రకటిస్తే స్వాగతిస్తామన్నారు. మోడీ ప్రధాని అభ్యర్ధి అయితే రానున్న ఎన్నికల్లో వందశాతం ఎన్డీఏదే విజయమని చెప్పారు.