: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సైనా నెహ్వాల్
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. ఈ ఉదయం వీఐపీ విరామ సమయంలో సైనా.. స్వామివారి సేవలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి తీర్ధప్రసాదాలు అందజేశారు. కాగా, మంగళవారం నెహ్వాల్ శ్రీకాళహస్తిలో కుటుంబ సమేతంగా రాహుకేతు పూజలు చేసింది.