: షారూక్ ఖాన్ తప్పు చేయలేదు: బీఎంసీ


అద్దెగర్భం ద్వారా ఇటీవలే ఓ బాబు(అబ్ రామ్)ను పొందిన షారూక్ ఖాన్ కు బృహన్ ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) వచనాలు ఊరటనిచ్చాయి. అబ్ రామ్ పుట్టకముందు ఆ సర్రొగేట్ మదర్ కు షారూక్, గౌరీ దంపతులు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారని వర్ష దేశ్ పాండే అనే సామాజిక కార్యకర్త కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. ఇది కచ్చితంగా నిబంధనలను ఉల్లంఘించడమేనని ఆమె ఆరోపించారు. దీనిపై బాంబే హైకోర్టు నేడు విచారణ చేపట్టింది.

అంతకుముందు ఈ విషయంలో నిజానిజాలు తేల్చాలంటూ బీఎంసీని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో బీఎంసీ అధికారులు కూడా విచారణకు హాజరయ్యారు. షారూక్ దంపతులు లింగనిర్ధారణ పరీక్షలు చేయించినట్టు వచ్చిన ఆధారాల్లేవన్నారు. బీఎంసీ న్యాయవాది ఎంపీఎస్ రావు తన వాదన సందర్భంగా, ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలు నిరాధారమని వివరించారు. కేవలం పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగానే వర్ష ఫిర్యాదు చేసినట్టుందని ఈ సందర్బంగా కోర్టు అభిప్రాయ పడింది. అనంతరం విచారణను రెండు వారాలు వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News