: ముజఫర్ నగర్ అల్లర్లపై కేంద్రం, యూపీ సర్కారుకు సుప్రీం నోటీసులు
ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో చెలరేగిన మత ఘర్షణల విషయంలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ సర్కారుకు నోటీసులు జారీచేసింది. ఈ నెల 16 లోగా సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అలాగే అల్లర్లలో గాయపడిన వారికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని సూచించింది. గతవారం చోటు చేసుకున్న ఈ అల్లర్లలో దాదాపు 40 మందిపైగా మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.