: గుంటూరు జిల్లాలో పిడుగుపాటుకు ఏడుగురు మృతి


గుంటూరు జిల్లాలో పిడుగుపాటుకు ఏడుగురు మరణించారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. జిల్లాలోని ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెంలో పిడుగుపడటంతో ఓ రైతు మరణించగా, అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. నాదెండ్ల మండలం సాతులూరులో పిడుగుపడి ఓ వ్యక్తి చనిపోగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఇతర మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు, జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

  • Loading...

More Telugu News