: రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి: పాల్వాయి
తెలంగాణ విభజన ప్రకటన నేపథ్యంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి, విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్థన్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, శాంతిభద్రతలు అదుపు తప్పాయని అన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని ఢిల్లీ పెద్దలకు తాము సూచించామని చెప్పారు. దీనికి వారు సుముఖత వ్యక్తం చేశారని వెల్లడించారు. పంజాబ్, హర్యానా విభజన కూడా రాష్ట్రపతి పాలనలోనే జరిగిందని ఆయన అన్నారు. సీఎం కిరణ్, బొత్స ఢిల్లీలో విభజనకు అనుకూలంగా తలలూపి ఇక్కడ అందుకు విరుద్థంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.