: కిరణ్ చేసింది కూడా తప్పే: హరీశ్ రావు
కానిస్టేబుళ్ళు జై తెలంగాణ అనడం తప్పయితే, సీఎం కిరణ్ జై సమైక్యాంధ్ర అనడం కూడా తప్పేనని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ధ్వజమెత్తారు. హైదరాబాదులో నేడు మీడియాతో మాట్లాడుతూ, కానిస్టేబుళ్ళు శ్రీనివాస్, శ్రీశైలంపై సస్పెన్షన్ వేటు వేయడానికి ముందే సీఎం, గవర్నర్ లను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె నేపథ్యంలో, తెలంగాణ ప్రాంతానికి విద్యుత్ కోతలు విధిస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. సీమాంధ్రలో ఆర్టీసీ బస్సులను నిలిపివేసి ప్రైవేటు బస్సులను తిరగనిస్తున్నారని హరీశ్ రావు దుయ్యబట్టారు.