: టీఆర్ఎస్ పొలిట్ బ్యూరోలో హరీశ్వర్ రెడ్డి
తెలంగాణ అంశంపై చంద్రబాబుతో విభేదించి టీడీపీని వీడిన పరిగి ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్ రెడ్డికి టీఆర్ఎస్ సముచిత స్థానం కల్పించింది. హరీశ్వర్ రెడ్డికి పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించింది. నాగం జనార్థనరెడ్డితో కలిసి టీడీపీకి గుడ్ బై చెప్పిన కొప్పుల అనంతరం తెలంగాణ నగారా సమితి ఆవిర్భావంలోనూ కీలకపాత్ర పోషించారు. తదనంతర పరిణామాల నేపథ్యంలో నాగంతో పొసగక టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన హరీశ్వర్ రెడ్డి అనుభవాన్ని గుర్తించిన కేసీఆర్ ఆయనకు పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించాలని నిర్ణయించారు.