: సమ్మెపై ఏపీఎన్జీవోల సమీక్ష
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ నెల రోజులుగా తాము సమ్మె బాటపట్టినా కేంద్రం ఏమీ పట్టనట్టు వ్యవహరించడంపై ఏపీఎన్జీవోలు సమీక్ష నిర్వహిస్తున్నారు. సమ్మెను ఎలా ఉద్ధృతం చేయాలి? అనే అంశంపై ఇతర జేఏసీ నేతలతో ఏపీఎన్జీవో హోంలో చర్చిస్తున్నారు. జిల్లాల్లో సమ్మె ఉద్ధృతంగా సాగుతున్నా హైదరాబాదులో స్పందన లేకపోవడమే కారణమని నిర్థారణకు వచ్చారు. దీంతో హైదరాబాదులో ఎలాంటి కార్యాచరణ చేపట్టాలి అనే దానిపై చర్చిస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు చర్చల వివరాలను ప్రకటించనున్నారు.