: హైదరాబాద్ సీబీఐ ఎస్పీగా చంద్రశేఖరన్


సీబీఐ హైదరాబాద్ విభాగం ఎస్పీగా చంద్రశేఖరన్ నియమితులయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయన హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. బదిలీకి ముందు ఆయన ముంబై సీబీఐ ఎస్పీగా పని చేశారు.

ప్రస్తుతం సీబీఐ డీఐజీగా విధులు నిర్వహిస్తున్న హెచ్.వెంకటేష్ డిప్యుటేషన్ గడువు ముగియడంతో... వారం రోజుల్లో సొంత కేడర్ కేరళకు తిరిగి వెళ్లనున్నారు. 2009లో సీబీఐలోకి ఎస్పీగా డిప్యుటేషన్‌పై వచ్చిన వెంకటేష్‌కు ఈ ఏడాది మొదట్లో డీఐజీగా పదోన్నతి లభించింది.

  • Loading...

More Telugu News