: కర్రీ ప్యాకెట్లో చచ్చిన పాము!
కేరళలోని ఓ వైద్య కళాశాలలో క్యాంటీన్ సిబ్బంది నిర్లక్ష్యం అధికారుల ఆగ్రహానికి కారణమైంది. వివరాల్లోకెళితే.. తిరువనంతపురంలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన కుమారుడికి పచ్చి బఠాణీ కర్రీ తీసుకెళ్ళేందుకు ఓ మహిళ కళాశాల ప్రాంగణంలోని క్యాంటీన్ కు వచ్చింది. అక్కడ వారిచ్చిన కర్రీ ప్యాకెట్ తీసుకుని ఆసుపత్రికి చేరుకుంది. ఆ ప్యాక్ తెరిచి చూసిన ఆమె భయభ్రాంతులకు లోనైంది. కారణం, దాంట్లో చచ్చిన పాము ఉండడమే. ఈ విషయాన్ని ఆమె ఆసుపత్రి అధికారులకు చెప్పింది. ఎలాగో ఈ విషయం బయటికి తెలియడంతో ప్రజలు ఆందోళనకు దిగారు. దీంతో, పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగి సదరు క్యాంటీన్ కు మూతవేశారు. అక్కడి ఆహార పదార్థాల శాంపిళ్ళను పరీక్ష కోసం పంపారు.