: ఎమ్మెల్యే బంగారు ఉషారాణికి సమైక్యసెగ
రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఎమ్మెల్యే బంగారు ఉషారాణి ఇంటిని ముట్టడించారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే ఇంటికి చేరుకుని బైఠాయించారు. ఎమ్మెల్యే తక్షణం రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. దీంతో ఆమె మాట్లాడుతూ, తానిప్పటికే రాజీనామా చేశానని, ఉద్యమంలో ఉన్నానని స్పష్టం చేశారు. అలాగే భవిష్యత్తులో జరిగే అన్ని ఉద్యమాలకు అండగా ఉంటానని ఆమె హామీ ఇచ్చారు.