: ఈనెల 16న ఢిల్లీ వెళ్లనున్న టీ జేఏసీ
తెలంగాణ రాజకీయ జేఏసీ నేతలు ఈనెల 16న ఢిల్లీ వెళుతున్నారు. తెలంగాణ ప్రక్రియ వేగవంతం చేయాలని కోరుతూ కాంగ్రెస్ పెద్దలను, హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను కలవనున్నారు. అంతేకాక పదిజిల్లాలతో కూడిన తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని టీ జేఏసీ కోరనుంది. ఇదే పర్యటనలో బీజేపీ నేత సుష్మాస్వరాజ్ ను కూడా టీ జేఏసీ కలవనుంది.