: 2016 నాటికి టైటానిక్-2లో ప్రయాణం!
టైటానిక్..ఈ పేరు వింటే చాలు..ఆకర్షణీయమైన నౌక రూపం మన కళ్ల ముందు మెదులుతుంది . సముద్ర ప్రయాణీకుల సుందర స్వప్నం టైటానిక్ నౌకా విహారం. అయితే వందేళ్ల కిందటే ప్రమాదంలో టైటానిక్ నౌక సముద్రంలో మునిగిపోయింది.
తాజాగా టైటానిక్ నౌక లేని లోటును తీరుస్తానంటున్నారు ఆస్ట్రేలియాకు చెందిన వ్యాపారవేత్త స్లీవ్ పామర్. అంతేకాదు, 4 బిలియన్ డాలర్లతో 2016 కల్లా ఈ నౌకలో సాగర జలాల్లో విహరించవచ్చని హమీ ఇస్తున్నారు. టైటానిక్ బ్లూ ప్రింట్ సహయంతో టైటానిక్-2 నౌక నిర్మాణ బాధ్యతను చైనాకు అప్పగించనున్నట్లు పామర్ తెలిపారు.
1912 ఏప్రిల్ 15వ తేదీన ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో మంచుకొండని గుద్దుకొని టైటానిక్ నౌక మునిగిపోయింది. అందులోని 2,200మంది ప్రయాణీకుల్లో 700 మంది మాత్రమే ఈ భారీ నౌకా ప్రమాదంలో ప్రాణాలు దక్కించుకోగలిగారు. మానవ చరిత్రలో పలు దుర్ఘటనల్లో ఒకటిగా ఈ నౌకా విషాదాన్ని చెబుతారు.
- Loading...
More Telugu News
- Loading...