: తెలంగాణకు వాస్తుదోషం!
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించడానికి వాస్తు దోషాలు అడ్డంకిగా నిలుస్తున్నాయని ప్రఖ్యాత సిద్ధాంతి గౌరు తిరుపతి రెడ్డి అభిప్రాయపడ్డారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర విభజనపై వాస్తు శాస్త్ర విశ్లేషణను వివరించారు. చత్తీస్ గఢ్ రాష్ట్రంతో పాటు శ్రీలంక, సోమాలియా వంటి దేశాలు కూడా తమ భూభాగంలో ఈశాన్య ప్రాంతాన్ని కోల్పోవడం వల్ల కష్టాలెదుర్కొంటున్నాయని సూత్రీకరించారు. ఇప్పుడు తెలంగాణ పరిస్థితీ అంతేనన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోతే తెలంగాణ రెండు ఈశాన్యాలనూ కోల్పోతుందని, వాస్తు రీత్యా అది ప్రమాదకరమని గౌరు హెచ్చరించారు. ఇక రాయలసీమకు ఇదే ఫలితం వస్తుందన్నారు. సీమ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినా, తెలంగాణతో కలిసి రాయల తెలంగాణగా అవతరించినా వాస్తు దోషం తప్పదని తేల్చి చెప్పారు.