: పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ
పార్టీ ముఖ్య నేతలతో హైదరాబాదులోని తన నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, తాజా పరిణామాలపై చర్చిస్తున్నారు. బస్సుయాత్ర తొలి షెడ్యూల్ లో భాగంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటన ముగించుకుని ఈ ఉదయమే బాబు నగరానికి వచ్చారు. నిన్న పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ను నియమించారు. ఇందుకు కృతజ్ఞతగా తలసాని భారీ ర్యాలీతో బాబు నివాసానికి వచ్చారు.