: నేడు రాష్ట్ర వ్యాప్తంగా వస్త్ర వ్యాపారుల బంద్
వస్త్రాల అమ్మకంపై విధించిన వ్యాట్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వస్త్ర వ్యాపారులు బంద్ నిర్వహిస్తున్నారు. ఏ రాష్ట్రంలోనూ అమలులో లేని వస్త్రాలపై వ్యాట్..మన రాష్ట్రంలో అమలు చేయడాన్ని వ్యాపారులు ఖండిస్తున్నారు.
వ్యాట్ తోనే వస్త్ర వ్యాపారులు ఇబ్బంది పడుతుంటే..దెబ్బ మీద దెబ్బ అన్నట్లు సెన్సిటివ్ కమాడిటీస్ చట్టాన్ని అమలు చేయడం తగదని వస్త్ర వ్యాపారుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాష్ అన్నారు. వస్త్రాల అమ్మకంపై వ్యాట్ తో పాటు, కొత్త చట్టాల్ని రద్దు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వస్త్ర సంఘాలు ఏకతాటిపై బంద్ పాటిస్తున్నాయని ఆయన తెలిపారు.