: జగన్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణను సీబీఐ కోర్టు ఈనెల 18కి వాయిదావేసింది. అయితే, పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలన్న కోర్టు ఆదేశానికి సీబీఐ వారం రోజుల గడువు కోరింది. కాగా, ఈనెల 16న గానీ, 17న గానీ మరో చార్జ్ షీట్ దాఖలు చే్స్తామని సీబీఐ కోర్టుకు తెలిపింది. మరోవైపు, మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ బెయిల్ పిటిషన్ పై విచారణను కోర్టు రేపటికి వాయిదావేసింది.