: మీలా.. మేం రెచ్చగొట్టం: రాహుల్
ఇతరపార్టీల్లా కాంగ్రెస్ పార్టీ రెచ్చగొట్టేలా మాట్లాడదని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థులపై సంయమనంతో వ్యవహరిస్తుందని నరేంద్ర మోడీని ఉద్థేశించి అన్నారు. విపక్షం పసలేని ఆరోపణలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ సైనికులుగా దేశాభివృద్ధికి పాటుపడుతున్నామని అన్నారు.