: టీటీడీ చైర్మన్ కు సమైక్యసెగ
టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజుకు తిరుపతిలో సమైక్యసెగ తగిలింది. హైదరాబాద్ నుంచి తిరుపతికి రైలు మార్గంలో వస్తున్నట్టు సమాచారం అందుకున్న శ్రీవెంకటేశ్వరా యూనివర్సిటీ విద్యార్థులు రైల్వే స్టేషన్ కు చేరుకుని బాపిరాజును అడ్డుకున్నారు. సీమాంధ్రలో ఉద్యమం లేదని ఢిల్లీలో చెప్పడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం సీమాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన కాళ్లపై పడి ప్రాధేయపడ్డారు. తాను సమైక్యవాదినని చెప్పినా విద్యార్థులు శాంతించలేదు. దీంతో పోలీసులు విద్యార్థులను అడ్డుకుని భారీ బందోబస్తు నడుమ కనుమూరిని తిరుమలకు పంపించారు.