: పాజిటివ్‌గా ఉంటే పదేళ్లపాటుంటాం!


మన ఆలోచనలు ఎప్పుడూ సానుకూలంగా ఉంటేచాలు... మన ఆయుష్షును పెంచుకోవచ్చట. అంటే మనం సానుకూలంగా ఆలోచించడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది... ఫలితంగా మనకు ఎలాంటి జబ్బులు రాకుండా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇలాంటి ఆలోచనలున్న వారికి జబ్బులు కూడా పెద్దగా రావని... దీనివల్ల వీరు దీర్ఘకాలం పాటు జీవించే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

టిల్‌బర్గ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు సానుకూల దృక్పథంతో ఉండేవారు ఎక్కువ కాలం పాటు జీవిస్తారని ప్రత్యేక అధ్యయనం ద్వారా తేల్చారు. వీరు గుండెజబ్బు బాధితుల్లో సానుకూల దృక్పథం ఉన్నవారు, లేనివారిపై సుమారు ఐదేళ్లపాటు ఒక ప్రత్యేక అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో సానుకూల దృక్పథం ఉన్నవారికి మరణించే ముప్పు 42 శాతం తక్కువగా ఉన్నట్టు తేలింది. ఇలాంటివారు ఎక్కువగా వ్యాయామం చేస్తున్నట్టు, ఇది ఆయుష్షు పెరగడానికి చాలా దోహదపడినట్టు పరిశోధకులు గుర్తించారు. సానుకూల ఆలోచనలు గలవారు గుండె సంబంధిత సమస్యలతో ఆసుపత్రుల చుట్టూ తిరగడం తగ్గుతున్నట్టు వీరి పరిశోధనలో తేలింది. ఈ విషయాలను గురించి టిల్‌బర్గ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన సుసానే ఎస్‌.పెడెర్సన్‌ మాట్లాడుతూ గుండెజబ్బుల చికిత్స అనంతరం వారిలో సానుకూల థోరణి పెంపొందింపజేయడంతోబాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయించేలా చూడటం తప్పనిసరని, వ్యాయామం వల్ల ఆశావహ దృక్పథంతోపాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News