: హైదరాబాద్ పాతబస్తీలో కాల్పుల కలకలం
హైదరాబాద్ పాతబస్తీలోని ఫలక్ నుమా వద్ద ఈ సాయంత్రం కాల్పుల కలకలం చోటు చేసుకుంది. స్థానిక వ్యాపారి షానవాజ్ కుమారుడు కరీంపై కాల్పులు జరిగాయి. కరీం మెడనుంచి బుల్లెట్ దూసుకెళ్ళింది. అయితే, తుపాకీ మిస్ ఫైర్ అయిందని పోలీసులు అంటున్నారు. వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.