: ఉద్యోగాలిప్పించే బాధ్యత నాది: చంద్రబాబు
నిరుద్యోగులందరికీ ఉద్యోగాలిప్పించే బాధ్యత తనదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా తిరువూరు మండలం ఎర్రమాడులో ఆరో రోజు తెలుగువారి ఆత్మగౌరవ యాత్రలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నేతలు ఇళ్లు కూడా దోపిడీ చేసే స్థితికి వచ్చారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో విద్యుత్తు, నీరు అన్నీ సమస్యలేనని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లీకుల వీరుడని చంద్రబాబు మండిపడ్డారు.