: రైల్వే కోర్టులో రాములమ్మ
మెదక్ ఎంపీ విజయశాంతి నేడు సికింద్రాబాదులోని రైల్వే కోర్టుకు హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా, విజయశాంతిపై రైల్ రోకో కేసు నమోదు చేశారు. ఆ కేసు విచారణ నిమిత్తం రాములమ్మ నేడు కోర్టుకొచ్చారు. ఆమెతో పాటు ఇతరుల వాంగ్మూలాలను కూడా స్వీకరించిన న్యాయమూర్తి తదుపరి విచారణను నవంబర్ 19కి వాయిదా వేశారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ, తనపై తప్పుడు కేసు నమోదు చేశారని ఆరోపించారు. అయినా, న్యాయవ్యవస్థపై నమ్మకముందని, తన తప్పులేదని తేలుతుందని ధీమా వ్యక్తం చేశారు. కోర్టుకు హాజరైన సమయంలో ఆమె వెంట టీఆర్ఎస్ సస్పెన్షన్ కు గురైన నేత రఘునందన్ కూడా ఉన్నారు.