: సోనియా చేతికి యూఎస్ కోర్టు సమన్లు
ఇందిరాగాంధీ మరణానంతరం 1984లో చోటు చేసుకున్న సిక్కు వ్యతిరేక ఆందోళనలకు సంబంధించి అమెరికా కోర్టు జారీ చేసిన సమన్లు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చేతికి అందాయి. నిన్న(మంగళవారం) న్యూయార్క్ లోని ఓ కేన్సర్ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది సహాయంతో సోనియాకు సమన్లు అందజేసినట్టు తెలుస్తోంది. మొదట ఆసుపత్రి సిబ్బంది ఇందుకు తిరస్కరించినా, ఆసుపత్రి సిబ్బంది పేరిట న్యాయమూర్తి జారీ చేసిన ఆదేశంతో సమన్లను వారికి ఇచ్చారని, ఆ సిబ్బంది వాటిని సోనియాకు అందజేసినట్లు సమాచారం. ఈ సమన్లపై సెప్టెంబర్ 30 లోగా సోనియా తన సమాధానం తెలియజేయాల్సి ఉంటుంది.