: రాజస్థాన్ లో నేటినుంచి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం
నవంబర్ లో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నేడు రాజస్థాన్ లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రారంభిస్తున్నారు. అనంతరం సలంబర్ నియోజకవర్గంలోని ఉదయ్ పూర్ డివిజన్ లో జరిగే ఎన్నికల ర్యాలీలో రాహుల్ ప్రసంగం ఉంటుంది. ఈ నెల 17న బారన్ ప్రాంతంలో కూడా రాహుల్ ప్రసంగిస్తారని రాజస్థాన్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఇన్ ఛార్జ్ గురుదాస్ కామత్ తెలిపారు. అధినేత్రి సోనియాగాంధీ కూడా రెండు ర్యాలీల్లో ప్రసంగిస్తారని చెప్పారు. కాగా, బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని మోడీ ప్రారంభించిన మరుసటిరోజే కాంగ్రెస్ ప్రచారం మొదలుపెట్టడం గమనార్హం.