: ఎస్పీ ప్రభుత్వాన్ని రద్దు చేయండి: ముస్లిం సంఘాల డిమాండ్


2014లో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీకి ముస్లిం వోట్లు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ముజఫర్ నగర్లో చెలరేగిన మత ఘర్షణల విషయంలో ముస్లింలు ఆ పార్టీపై ఆగ్రహంగా ఉన్నారు. మత సామరస్యాన్ని కాపాడడంలో విఫలమైన ఎస్పీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని పలు ముస్లిం సంఘాలు డిమాండ్ చేశాయి. జామియత్ ఉలేమా హింద్, అల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, అల్ ఇండియా ముస్లిం మజ్లిసే ముష్వరత్, జమాతే ఇస్లామి హింద్ తదితర సంస్థలు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశాయి. ఆందోళనకారులతోనూ, బీజేపీతోనూ ఎస్పీ చేతులు కలిపి 2014 ఎన్నికల్లో లాభపడేందుకు రాష్ట్రంలోని వాతావరణాన్ని మతపరంగా మార్చేస్తోందని ఆ సంస్థలు ఆరోపించాయి.

  • Loading...

More Telugu News