: ఇరుప్రాంతాల వారిని కూర్చోబెట్టి మాట్లాడాలి: బాబు


రాష్ట్ర విభజన అంశంపై రెండు ప్రాంతాల నేతలను కూర్చోబెట్టి మాట్లాడినప్పుడే సమస్య పరిష్కారం అవుతుందని, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు సద్దుమణుగుతాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవం పేరిట బాబు చేపట్టిన బస్సు యాత్ర నేడు కృష్ణా జిల్లాలోని తిరువూరు నియోజకవర్గంలో సాగింది. గాదెవారి గూడెంలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాల్సిందిపోయి, కాంగ్రెస్ పార్టీ స్వప్రయోజనాలను చూసుకుంటోందని వ్యాఖ్యానించారు. అన్ని పార్టీలు తెలంగాణ అంశాన్ని పరిష్కరించాలని కోరాయని, అయితే, యూపీఏ సర్కారు మాత్రం ఏకపక్ష నిర్ణయంతో రాష్ట్రంలో అగ్గి రాజేసిందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News