: కొవ్వూరులో 'లక్ష జన గళ గర్జన'
సమైక్యాంధ్రకు మద్దతుగా పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక వాటర్ ట్యాంకు సెంటర్ లో 'ఉగ్ర గోదావరి లక్ష జన గర్జన' నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు సమైక్యాంధ్రకు మద్దతుగా పలు ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వేలాదిగా తరలి వచ్చిన సమైక్యవాదులతో కొవ్వూరు జనసంద్రంలా మారింది. దీంతో సమైక్యాంధ్రకు మద్దతుగా పట్టణంలో స్వచ్ఛంద బంద్ పాటిస్తున్నారు. దుకాణాలు, వాణిజ్య సంస్థలు, పాఠశాలలు మూసివేశారు. పలువురు విద్యార్థులు అల్లూరి, గాంధీ, భరతమాత, తెలుగుతల్లి వేషధారణలతో ఆకట్టుకున్నారు.