: గ్లోబల్ మార్కెట్లో తగ్గుతున్న బంగారం ధరలు


అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు దిగి వస్తున్నాయి. ఔన్సు (31గ్రాములు) బంగారం ధర 1364 డాలర్లకు చేరుకుంది. సమీప కాలంలో ఇది 1300 డాలర్లకు దిగి వస్తుందని భావిస్తున్నారు. సిరియాపై సైనిక చర్య యోచనను అమెరికా ప్రస్తుతానికి పక్కన పెట్టడం, ఫెడరల్ రిజర్వు బాండ్ల కొనుగోలును తగ్గించే గడువు సమీపిస్తుండడం వల్ల ఇన్వెస్టర్లు బంగారం నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారని, అందుకే ధరలు తగ్గుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈరోజు దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 150 రూపాయలు లాభపడి 30,900 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది

  • Loading...

More Telugu News