: హైకోర్టు పరిసరాల్లో భారీ భద్రత
హైకోర్టు పరిసరాల్లో పోలీసులను భారీగా మోహరించారు. తెలంగాణ న్యాయవాదులు, సీమాంధ్ర న్యాయవాదులు హైకోర్టు వేదికగా ఆందోళనలు చేపట్టే అవకాశం ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. హైకోర్టు పరిసరాల్లో సభలు, ర్యాలీలపై పోలీసులు ఆంక్షలు విధించారు. మరోవైపు, నిన్న హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇరు ప్రాంతాల న్యాయవాదులు, న్యాయమూర్తులతో సమావేశమై హైకోర్టులో సామరస్యపూర్వక వాతావరణం నెలకొల్పాల్సిన అవసరాన్ని వివరించారు.