: దౌత్యం విఫలమైతే సిరియాపై దాడి ఖాయం: ఒబామా
సిరియా సమస్యకు దౌత్యపరమైన పరిష్కారాన్ని కోరుకుంటున్నామని అమెరికా అధ్యక్షుడు ఒబామా అన్నారు. దౌత్యం విఫలమైతే సిరియాపై దాడి తప్పదన్నారు. సిరియా ప్రభుత్వాన్ని కట్టడి చేయకుంటే, అసద్ ప్రభుత్వం రసాయనిక ఆయుధాల వినియోగాన్ని ఆపదని అభిప్రాయపడ్డారు. రసాయనిక ఆయుధాలను అంతర్జాతీయ సమాజానికి అప్పగించేందుకు సిరియా ప్రభుత్వం సమ్మతి తెలపడంతో.. సైనిక చర్యకు అనుమతించే తీర్మానంపై ఓటింగ్ ను వాయిదా వేయాలని ఒబామా కాంగ్రెస్ ను కోరారు.