: నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో కేబుల్ ప్రసారాల నిలిపివేత
ఈరోజు మధ్యాహ్నం నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో కేబుల్ ప్రసారాలు నిలిచిపోనున్నాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా ఎమ్ఎస్ఓలు, కేబుల్ ఆపరేటర్ల జేఏసీ పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు జేఏసీ కన్వీనర్ కన్నబాబు తెలిపారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు టీవీ ప్రసారాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.