: నిమజ్జనానికి 20 కిలోల వెండి వినాయకుడు


మట్టి వినాయకుడు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుడు, రుద్రాక్షల వినాయకుడు... ఇలా ఎన్నో రకాల వినాయక విగ్రహాలను మనం చూశాం. కాని చెన్నైలో ఏకంగా వెండి వినాయకుడిని ప్రతిష్ఠించారు. దీని బరువెంతో తెలిస్తే ఆశ్చర్యపోతాం... అక్షరాలా 20 కిలోలు. ఈ వినాయకుడు చెన్నైలోని ప్రకాశ్ రావ్ కాలనీలో పూజలందుకుంటున్నాడు. ఈ నెల 22న ఈ వినాయకుడిని సముద్రంలో నిమజ్జనం చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. విగ్రహాన్ని పడవలో 20 కి.మీ దూరం తీసుకెళ్లి అక్కడ నిమజ్జనం చేస్తామని అన్నారు.

  • Loading...

More Telugu News