: కేదార్ నాథ్ ఆలయంలో పూజలు ప్రారంభం


ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ జ్యోతిర్లింగ క్షేత్రంలో పూజలు తిరిగి ప్రారంభమయ్యాయి. 24 మంది సభ్యులతో కూడిన అర్చకుల బృందం, ఆలయ కమిటీ సమక్షంలో ఈ పూజలు మొదలయ్యాయి. కేదార్ నాథ్-బద్రీనాథ్ కమిటీ, అధికారుల పర్యవేక్షణలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను చేశారు. జూన్ లో ఉత్తరాఖండ్ లో వరదలు విలయం సృష్టించాయి. దాంతో, 86 రోజుల అనంతరం ఇక్కడ పూజలు పునఃప్రారంభమయ్యాయి. అయితే, భక్తులు సందర్శించుకోవడానికి రోడ్డు మార్గంలో అనుమతి ఇవ్వడంలేదు.

  • Loading...

More Telugu News