: భారతీయుడిని కీలక పదవిలో నియమించిన ఒబామా
అమెరికా అధ్యక్షుడు ఒబామా మరోసారి భారత సంతతి పట్ల తన నమ్మకాన్ని చాటుకున్నారు. భారతీయ అమెరికన్ పునీత్ తల్వార్ ను అమెరికా రాజకీయ సైనిక వ్యవహారాల సెక్రటరీగా ఒబామా నియమించారు. ఆయనతో పాటు 29 మందిని వివిధ పదవులలో నియమించినట్లు అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ నుంచి ప్రకటన వెలువడింది. అంతర్జాతీయ భద్రత, మిలటరీ కార్యకలాపాలు, రక్షణ వ్యూహం, ప్రణాళిక, రక్షణ వాణిజ్యం తదితర వ్యవహారాలను పునీత్ పర్యవేక్షించనున్నారు.